Buchi Babu: అలా చూస్తారని ఊహించలేదు.. పెద్దిలో జాన్వీ కపూర్ పాత్రపై దర్శకుడు బుచ్చిబాబు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఎంతో కాలంగా మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది

ఎన్నో నెలలుగా పెద్ది కోసం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు పెద్దిని సిల్వర్ స్క్రీన్ పై విట్‌నెస్ చేసి ఊగిపోతున్నారు. పెద్ది మ్యానియాతో థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా… పెద్దిగాడి ఆట చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చరణ్ పర్మార్మెన్స్ ఇచ్చే మత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెద్ది సినిమాలో జాన్వీ గ్లామర్ కాస్త ఓవర్ డోస్ అయిందని కామెంట్ చేస్తున్నారు. బుచ్చి తీరును విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు జాన్వీ సీన్స్ పై క్లారిటీ ఇచ్చాడు. పెద్ది సినిమా జూన్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విడుదలైన అన్ని ఏరియాల్లో పెద్ది సినిమా దుమ్మురేపుతోంది.
కాగా సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ పాత్ర పై ఆమె గ్లామర్ డోస్ పై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ ను సరిగ్గా చూపించలేదని, ఆమెను గ్లామర్ పరంగానే చూపించారు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కాగా దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఆ సన్నివేశాలను ప్రేక్షకులు ఇంత నెగిటివ్ గా చూస్తారని నేను ఊహించలేదు అని అన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల మధ్య ఒక సరదా ప్రేమకథను చూపించాలన్నది మా ఆలోచన. అయితే, మేము మరింత జాగ్రత్తగా ఉండి, పాత్రలను మరింత మెరుగ్గా చిత్రీకరిస్తాము అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
కాగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అచియ్యమ్మ పాత్రలో కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర పెద్దగా లేకపోయినప్పటికీ గ్లామర్ పరంగా ఆకట్టుకుందని సినిమా ఆడియన్స్ అంటున్నారు. కాగా ఇప్పుడు అదే విమర్శలకు దారితీసింది. ఇక పెద్ది సినిమా విషయానికొస్తే తొలి రోజే రికార్డ్ స్థాయిలో ఓపినింగ్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా పెద్ది రూ. 135 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యమరింత పెరిగి టాలీవుడ్ లో నయా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
