Payal Rajput: ప్రియుడికి రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన పాయల్ రాజ్‌పుత్.. ఫొటోలు చూశారా?

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. మధ్యలో వరుసగా అపజయాలు ఎదుర్కొన్నా మంగళవారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.

Payal Rajput: ప్రియుడికి రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన పాయల్ రాజ్‌పుత్.. ఫొటోలు చూశారా?
Payal Rajput

Updated on: Mar 21, 2025 | 9:38 AM

మంగళవారం సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కింది పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 తర్వాత వరుసగా ఫ్లాపులతో డీలా పడిపోయిన ఈ బ్యూటీకి మంగళవారం సినిమా సరికొత్త జోష్ ఇచ్చింది. ఇప్పుడిదే ఉత్సాహంలో వరుసగా సినిమాలకు సైన్ చేస్తోందీ అందాల తార. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది పాయల్ రాజ్ పుత్. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో మొత్తం ఆరు భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది పాయల్. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. అలా తాజాగా పాయల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్‌ ధింగ్రా పుట్టినరోజు కావడంతో రొమాంటిక్ గా విషెస్ చేసింది. వివిధ సందర్భాల్లో అతనితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. ‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, జాలి, దయ, మద్దతు నా జీవితంలో నిజమైన దీవెనలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నాను. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తన ప్రియుడిపై ప్రేమను కురిపించింది పాయల్.

ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వెంకటలచ్చిమి సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది పాయల్ రాజ్ పుత్. ఇటీవలే హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైంది. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో ముని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన‌ ఈ రివేంజ్ డ్రామా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు ముని.

ఇవి కూడా చదవండి

ప్రియుడితో పాయల్ రాజ్ పుత్..

పాయల్ రాజ్ పుత్ చేతిలో వెంకటలచ్చిమితో పాటు మరో కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి