AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: నటీనటుల నోటి దూల వల్ల సినిమాలకు సమస్య రాకూడదు : బండ్ల గణేష్

మా కంట్రోల్ లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి అని విశ్వక్ అన్నారు. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను అని విశ్వక్ సేన్ అన్నారు.

Bandla Ganesh: నటీనటుల నోటి దూల వల్ల సినిమాలకు సమస్య రాకూడదు : బండ్ల గణేష్
Bandla Ganesh
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2025 | 5:34 PM

Share

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. తాజాగా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అదరగొట్టాడు. కామెడీ సీన్స్ లో విశ్వక్ ఆకట్టుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ యాక్షన్ సీన్స్ తోపాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. పృథ్వి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి.

ఈవివాదం పై విశ్వక్ సేన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ పలాన వ్యక్తి స్టేజి మీద ఏం మాట్లాడుతాడు అనేది మేము ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను, నిర్మాత సాహు గారు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే సోషల్ మీడియా అంతా బాయ్ కాట్ లైలా అని కనిపించింది. మ్యాటర్ ఏంటి అని ఆరా తీస్తే అప్పుడు విషయం మాకు అర్థమైంది అని విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఈ  వివాదం పై నటుడు నిర్మాత బండ్లగణేష్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బండ్ల గన్స్ మాట్లాడుతూ.. రాజకీయాలను, సినిమాలను ఒకటిగా చూడకూడదు, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు… సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటీనటుల నోటి దూల వల్ల సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి అని అన్నారు బండ్ల గణేష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం