Ustaad Bhagat Singh:మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు తగ్గింపు.. ఇకపై ఆ రేట్స్‌తోనే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మూడు రోజుల్లో రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా 'ఉస్తాద్' చిత్ర బృందం మూవీ లవర్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో సోమవారం (మార్చి23) నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోటానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అయితే తెలంగాణతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ సోమవారం ఈ రోజు నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్ రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ. 125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా మంచి టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే ‘ సాంగ్ రీమిక్స్ కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. కాగా అన్ని సినిమాల్లాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణలో లేదు కానీ ఏపీలో మాత్రం 10 రోజుల వరకు ఈ సౌలభ్యాన్ని కల్పించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడీ పెంచిన ధరలను చిత్ర బృందం ఉపసంహారించుకుంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ టికెట్ ధరలతోనే సినిమా ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. కాగా టికెట్ల ధరలు తగ్గించడం వల్ల మరింత మంది ఆడియెన్స్, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..
This scene…and the high it gave to all the cults 🔥🔥
Watch #UstaadBhagatSingh in theatres now! 🎟️ https://t.co/AoKtmL8aVG#BlockbusterUBS
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @thisisdsp @musicthaman @rparthiepan @DoP_Bose #AnandSai @venupro… pic.twitter.com/Pqfv5J5czc
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




