Bro Movie: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. పవన్‌, తేజ్‌ల ‘బ్రో’ సినిమా టికెట్లపై నిర్మాత కీలక ప్రకటన

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'బ్రో'. మామ, అల్లుళ్లు మొదటిసారిగా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Bro Movie: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. పవన్‌, తేజ్‌ల బ్రో సినిమా టికెట్లపై నిర్మాత కీలక ప్రకటన
Bro Movie

Updated on: Jul 20, 2023 | 6:47 AM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘బ్రో’. మామ, అల్లుళ్లు మొదటిసారిగా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్స్‌, గ్లింప్స్‌, సాంగ్స్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో స్పీడ్‌ పెంచారు మేకర్స్‌. ఇదే సమయంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మూవీ లవర్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. బ్రో మూవీ టికెట్ల ధరలు పెంచడం లేదని స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాను పరిమిత బడ్జెట్‌లోనే తెరకెక్కించామన్నాడు. అందుకే పవన్ కల్యాణ్, తేజ్ ల మూవీ టికెట్ల ధరను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వప్రసాద్‌ తెలిపారు.

కాగా ఇటీవల ఏ పెద్ద హీరో అయినా, భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనా టికెట్ల ధరను పెంచేస్తున్నారు. కనీసం మొదటి వారం రోజుల పాటు పెరిగిన టికెట్ల ధరలు అమల్లో ఉంటున్నాయి. అయితే బ్రో విషయంలో టికెట్ల రేట్ల పెంపులేవీ ఉండవని నిర్మాత స్పష్టం చేశారు. తమిళ్‌లో వచ్చిన ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. త్రివిక్రమ్‌ స్క్రీన్ ప్లే సమకూర్చారు. జులై 21న ఈ మూవీ ట్రైలర్‌ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..