Pawan Kalyan: “నిత్య చైతన్య కిరణాలు”.. సిరివెన్నెల యాదిలో పవన్

|

May 23, 2022 | 5:37 PM

సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. సినీవినీలాకాశంలో ఆయన ఓ ధ్రువతార. సిరివెన్నెలంటేనే సాహిత్యం.. సాహిత్యమంటేనే సిరివెన్నెల. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ..

Pawan Kalyan: నిత్య చైతన్య కిరణాలు.. సిరివెన్నెల యాదిలో పవన్
Pawan Kalyan
Follow us on

సిరివెన్నెల సీతారామ శాస్త్రి(Sirivennela Sitarama Shastri).. సినీవినీలాకాశంలో ఆయన ఓ ధ్రువతార. సిరివెన్నెలంటేనే సాహిత్యం.. సాహిత్యమంటేనే సిరివెన్నెల. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ.. దైర్యం చెప్పే కవి.. సాహిత్య కిరణాలతో నిత్యం ఉదయించే రవి సిరివెన్నెల. ఆయన కలం నుంచి జాలువారిన పాటలు ప్రతి మనసును కదిలిస్తాయి. ‘నా ఉఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం’ అంటూ కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు ఆయన. సిరివెన్నెల సాహిత్య సముద్రంలో మునగని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తన కలంతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిరివెన్నెల గతేడాది నవంబర్ 30న భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. పాటై మనకు వినిపిస్తూనే ఉంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సిరివెన్నెలను స్మరించుకున్నారు. సీతారామ శాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు అంటూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి ‘సిరివెన్నెల’ గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి…అంటూ రాసుకొచ్చారు పవన్.

ఇవి కూడా చదవండి

అలాగే మరో ట్వీట్ లో ” నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే” ‘రుద్రవీణ’ చిత్రంలోని ‘చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా’ పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి అన్నారు పవన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..