
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ ఫుల్ మూవీ భీమ్లానాయక్. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు ఈ మూవీ రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తోపాటు డైలాగ్స్ రచించారు. పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. ఇక ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ ఫిల్మ్ తాజాగా హిందీలోనూ రిలీజ్ కు రెడీ అయిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే మన సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న చిత్రయూనిట్. ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.
భీమ్లానాయక్ సినిమా తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే డిస్ని హాట్ స్టార్ లో కూడా ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది ఆహా. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ వీడియో ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సునీల్, హైపర్ ఆది, సప్తగిరి కూడా ఉన్నారు. ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :