పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి .. భీమ్లా నాయక్ VS బీప్లా నాయక్. బీప్ సౌండ్స్ వేస్తే తప్ప వినలేని అనేక మాటలను పోసాని అన్నారు. ఎందుకన్నారు అంటే పవన్ అభిమానులు అన్నారు కాబట్టి అన్నాను అంటున్నారయన. ఇప్పుడు పవన్ కౌంటర్‌కు రెడీ అయ్యారు . ఇంతకీ పవన్ స్పందన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. గబ్బర్ సింగ్ రేంజ్‌లో ఆవేశంతో ఉన్న పవన్.. పోసానికి కామెంట్స్‌కి దీటుగా జవాబివ్వనున్నారు. ఇక పవన్, పోసాని మధ్య మాటల యుద్ధం మొదలైంది. రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్. పవన్ చీఫ్‌గెస్ట్. ఆ వేదికపై నుంచి ఓ రేంజ్‌లో పంచ్‌లు గుప్పించారు. సినిమా ఫంక్షన్ కాస్తా… పొలిటికల్ సభగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, జగన్‌ను టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేశారు. కొన్ని అభ్యంతరక పదాలు కూడా వాడారు.. సీన్ కట్ చేస్తే…
పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంచ్ టూ ఇంచ్ పంచ్ టూ పంచ్ హైవోల్టేజ్ సమాధానాలు ఇచ్చారు. ఇది ఒక పార్ట్. తర్వాత ఇదే ఎపిసోడ్‌లోకి పోసాని ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మూవీ మరో రేంజ్‌కు వెళ్లింది. తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.