Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

పవర్‌ స్టార్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది పవన్‌ ట్రిపుల్‌ ధమాకా ఇవ్వబోతున్నారట. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు...

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

Edited By:

Updated on: Jan 21, 2021 | 12:44 PM

Pawan Kalyan: పవర్‌ స్టార్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది పవన్‌ ట్రిపుల్‌ ధమాకా ఇవ్వబోతున్నారట. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పవన్‌ కల్యాణ్. ఇప్పటికే షూట్‌ పూర్తి చేసుకున్న ‘వకీల్‌ సాబ్’‌ను సమ్మర్ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

వకీల్‌ సాబ్‌ సెట్స్ మీద ఉండగానే క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడిక్‌ డ్రామాను స్టార్ట్ చేశారు పవన్‌. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు క్రిష్ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ కూడా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది.

ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌. రెండు సినిమా షూటింగ్‌లు ప్యారలల్‌గా పూర్తి చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారట పవర్‌ స్టార్‌. అన్ని అనుకున్నట్టుగా జరిగితే మూడు మూడు నెలల గ్యాప్‌తో మూడు సినిమాలు రిలీజ్ చేయాలన్నది పవన్ ఆలోచన.. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Also Read :

Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…

RED movie : మంచి టాక్ తో దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’ మూవీ.. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా…