Pawan Kalyan: నన్ను ఆర్ధికంగా దెబ్బతీయడానికి కుట్ర..పంతానికి వస్తే.. నా సినిమాలు ఫ్రీగా రిలీజ్ చేస్తా..

|

Dec 12, 2021 | 8:02 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ, జనసేనల మధ్య రాజకీయ వైరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇరుపార్టీల నేతలు మాటల తూటాలతో ఒకరిపై ఒకరు తీవ్ర..

Pawan Kalyan: నన్ను ఆర్ధికంగా దెబ్బతీయడానికి కుట్ర..పంతానికి వస్తే.. నా సినిమాలు ఫ్రీగా రిలీజ్ చేస్తా..
Janasena
Follow us on

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ, జనసేనల మధ్య రాజకీయ వైరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇరుపార్టీల నేతలు మాటల తూటాలతో ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏపీ సీఎం జగన్ పై, ఆయన పరిపాలనా విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో సినిమా టికెట్స్ ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మరోసారి నిరసన వ్యక్తం చేశారు.

ఏపీలో తన సినిమాలనే టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందన్నారు. తన ఒక్కడిపై ఉన్న కోపంతో.. తెలుగు చలన చిత్ర పరిశ్రమపై పగసాధిస్తుందంటూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తన సినిమాలు ఆపేసి.. ఆర్ధికంగా దెబ్బతీయాలని సీఎం జగన్ చూస్తున్నారని.. అయితే తన సినిమాలను ఏపీలో రిలీజే చేయడం ఆపేసి తాను ఏ మాత్రం భయపడనని అన్నారు.  పంతానికి దిగితే తన సినిమాలను ఉచితంగా చూసేలా చేస్తానని.. తాను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వెనక్కి తగ్గే పిరికివాడిని కాదని స్పష్టం చేశారు.

అసలు ఏపీ ప్రభుత్వానికి , సీఎం జగన్ కు పారదర్శకత అంటే ఏమిటో తెలుసా.. ఒక్క సినిమా టికెట్స్ విషయంలో మాత్రమే ప్రభుత్వం పాలనలో పారదర్శకత గుర్తుకొచ్చింది.. అయితే అన్ని విషయాల్లో కూడా పాలనలో పారదర్శకత ఉండాలని హితవు పలికారు జనసేనాని..

ఏపీలో మద్యం కొనాలంటే వందలు కావాలి.. అదే సినిమాకు ఐదు రూపాయలు చాలు. ఇదే విషయంపై తనదైన శైలిలో జనసేన అధినేత వ్యాఖ్యానించారు. 700వందలను పెట్టి.. మద్యం కొని..  5రూపాయ‌ల‌తో సినిమాకు వెళ్లండ‌ని చెబుతారా.. ఇదెక్కడి న్యాయం అంటూ  ప్రశ్నించారు.  గత కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్స్ ధరపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read:  కార్‌ని మనుషులకంటే జాగ్రత్తగా శుభ్రం చేస్తున్న చింపాజీలు.. వీడియో నెట్టింట్లో వైరల్..