Pawan Kalyan: పవర్ స్టార్ న్యూలుక్ అదిరిపోయింది.. హరిహర వీరమల్లు నుంచి పవన్ లుక్ లీక్..

తాజాగా హరి హర వీరమల్లు సినిమా నుంచి మరో స్టిల్ బయటకు వచ్చింది. ఓ లేడీ టెక్నీషియన్‌ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

Pawan Kalyan: పవర్ స్టార్ న్యూలుక్ అదిరిపోయింది.. హరిహర వీరమల్లు నుంచి పవన్ లుక్ లీక్..
Actor Pawan Kalyan

Updated on: Dec 07, 2022 | 12:04 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా పాలిటిక్స్‌ నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్‌ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. ఈ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇక మరోవైపు ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే తాజాగా హరి హర వీరమల్లు సినిమా నుంచి మరో స్టిల్ బయటకు వచ్చింది. ఓ లేడీ టెక్నీషియన్‌ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పవన్‌ హరిహర వీరమల్లు లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో గెడ్డంతో పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్‌.

ఈ ఫోటోలో పవన్‌ కళ్యాణ్‌ రెడ్‌ డ్రెస్‌లో.. యుద్ధంలో పాల్గొనే యోధుడిలా తయారై ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. దీంతో పవన్‌ థిక్ బియర్డ్‌తో ఉన్న ఫోటోస్‌ బయటకు రావటంతో ఈ సినిమాలో పవన్‌ డ్యూయల్ రోల్ చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నారు. 17వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న పీరియాడిక్ జోనర్ మూవీ ఇది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

Hari Hara Veeramallu Movie

ఈ సినిమా తర్వాత పవన్ సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించనున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.