Hari Hara Veera Mallu : తిరిగి పట్టాలెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా.. ఎప్పడినుంచి అంటే.

|

Nov 27, 2021 | 11:29 AM

వకీల్ సాబ్ సినిమాతో పవర్ ఫుల్ గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. ఇప్పుడు అదే స్పీడ్ తో తన  నెక్స్ట్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు.

Hari Hara Veera Mallu : తిరిగి పట్టాలెక్కనున్న పవన్ - క్రిష్ సినిమా.. ఎప్పడినుంచి అంటే.
Pawan
Follow us on

Hari Hara Veera Mallu : వకీల్ సాబ్ సినిమాతో పవర్ ఫుల్ గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. ఇప్పుడు అదే స్పీడ్ తో తన  నెక్స్ట్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుంది. అలాగే రానాకు జోడిగా సంయుక్తమీనన్ నటిస్తుంది. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

హరిహరవీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రియాడికల్ స్టోరీతో రాబోతుంది. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. 2022  వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న  హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హరి హర వీర మల్లు పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం షట్ చేసిన తర్వాత కరోనా కారణంగా ఆపేశారు.. ఆతర్వాత పవన్ భీమ్లానాయక్ సినిమా పనుల్లో పడిపోయారు. ఇప్పుడు ఈ సినిమాను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. వచ్చేనెలలో ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..