పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఎలక్షన్స్ కంటే ముందు కొన్ని సినిమాలను లైనప్ చేశారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టకముందే.. పవన్ కొన్ని సినిమాలను లైనప్ చేశారు. వాటిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది.
హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ఎప్పటినుంచో జరుగుతుంది. చాలా కాలంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్యపాత్రలో నటిస్తుంది. అలాగే బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి తాజాగా క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈరోజు నుంచి(సోమవారం) షూటింగ్ లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి సమీపంలో ప్రత్యేక సెట్ ను నిర్మించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..