Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ‘హరి హర వీర మల్లు’ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతోనూ ఇటు సినిమాలతోను ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు  మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ హరి హర వీర మల్లు సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనట..
Pawan

Updated on: Jan 24, 2022 | 4:05 PM

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతోనూ ఇటు సినిమాలతోను ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు  మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు పవన్. ఇక ఈ సినిమా;తర్వాత ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో రాబోతున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకుసాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో పాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

హరి హర వీరమల్లు అనే టైటిల్ తో ఈ సినిమా  రానుంది. ప్రియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగు పూర్తయిన తరువాత ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. అయితే జనవరి 15  నుంచి ఈ సినిమా షెడ్యూల్ ను  మొదలు పెట్టాలని అనుకున్నారట,, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ జరపగా పోవడమే మంచిదని భావిస్తున్నారట. ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూసుకుని అప్పుడు షూటింగ్ మొదలుపెడదామని క్రిష్ తో పవన్  చెప్పినట్టుగా టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?