పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట చిత్రం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భీమ్లా నాయక్‌గా పవన్‌కు స్క్రీన్ పై చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో భీమ్లా నాయక్ గురించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అంతేకాదు.. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
Also Read: Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..
Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‌కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..
Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‌ను ఎలా చేశారో చూడండి..