బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా హజరయ్యారు. ఈ మేరకు పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతూ మనీష్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. “నా ప్రియమైన పరిణీతి, రాఘవ్ చద్ధాకు అభినందనలు. మీకు మా ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే నా అటెలియర్, హోంలో ఈ వేడుకకు సంబంధించిన దుస్తుల చర్చలు.. మీ నవ్వుకు గుర్తుగా టోన్ ఆన్ టోన్ జ్యామెట్రికల్ ఆర్ట్, మీ ప్రేమకు చిహ్నంగా గ్రీన్ కలర్ ఆభరణాలు డిజైన్ చేశాము. జీవితంలోని అన్ని ప్రేమపూర్వక జ్ఞాపకాలు మీతో ఉండాలి” అంటూ పోస్ట్ చేశారు.
అయితే పరిణీతి ధరించిన లెహాంగాను చేతితో డిజైన్ చేశారట. ఇందుకు దాదాపు 2500 గంటలు పట్టిందని సమాచారం. అందమైన టోనల్ ఎక్రూ బేస్‌ను అద్భుతమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అలంకరించారు. పాతకాలపు బంగారు దారాన్ని ఉపయోగించారు.
ముఖ్యంగా పరిణీతి ధరించిన దుపట్టాకు దేవనాగరి స్క్రిప్ట్‌లో రాఘవ్ పేరును బద్లా వర్క్‌లో రూపొందించారు. పరిణీతి మనీష్ మల్హోత్రా జ్యువెలరీ మల్టీ-టైర్డ్ నెక్లెస్‌తో అన్‌కట్, జాంబియన్. రష్యన్ పురాతన పచ్చలను ఉపయోగించడం వల్ల మరింత అద్భుతంగా కనిపించింది.
అంతకు ముందు గతేడాది ఏప్రిల్ లో అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు సైతం మనీష్ మల్హోత్రా వివాహ దుస్తులను డిజైన్ చేశారు. సంప్రదాయ ఎరుపు రంగు కాకుండా బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్‌తో ఐవరీ లెహెంగాను డిజైన్ చేశారు. తెల్లటి థ్రెడ్ ఎంబ్రాయిడరీని దుపట్టా డిజైన్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.