AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: వీకెండ్‌లో దుమ్మురేపిన ‘ది ప్యారడైజ్’.. నాని సినిమాకు 3 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మిక్స్ డ్ టాక్ వచ్చినా నాని 'ది ప్యారడైజ్' సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును టచ్ చేసిన ఈ మూవీ వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మేరకు ది ప్యారడైజ్ మూడు రోజుల వసూళ్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

The Paradise: వీకెండ్‌లో దుమ్మురేపిన 'ది ప్యారడైజ్'.. నాని సినిమాకు 3 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
The Paradise Movie
Basha Shek
|

Updated on: Sep 27, 2026 | 11:58 AM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు నెగెటివ్ రివ్యులూ కూడా ఇచ్చారు. అయితే వీటన్నిటినీ అధిగమించి మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ది ప్యారడైజ్. రెండో రోజు కాస్తా జోరు తగ్గినా వీకెండ్ లో నాని సినిమా మళ్లీ దుమ్మురేపింది. శనివారం (సెప్టెంబర్ 26) నాని సినిమాకు 20 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం. ఈ లెక్కన మొత్తం మూడు రోజులకు కలిపి ది ప్యారడైజ్ సినిమా ఓవరాల్ గా రూ. 136 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ది ప్యారడైజ్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న నాని ది ప్యారడైజ్ సినిమాతో రికార్డులు కొల్లగొడుతున్నాడు. మూడు రోజుల్లో నాని సినిమా 1.85 మిలియన్ డాలర్లు (17.72 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

కాగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ సినిమాలో జడల్ పాత్రలో నాని అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ కయాదు లోహర్ సుబ్బు పాత్రలో చాలా క్యూట్ గా కనిపించింది. ఇక కరడుగట్టిన విలన్ శికంజా మాలిక్ పాత్రలో మోహన్ బాబు ఆడియెన్స్ ను భయపెట్టాడు. వీరితో పాటు రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల్లో 136 కోట్ల కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!