Ante Sundaraniki: రంగంలోకి దూకారు.. సుందర్ మాస్టారూ.. అంటే సుందరానికి నుంచి పంచెకట్టు సాంగ్ ప్రోమో రిలీజ్..

|

Apr 05, 2022 | 2:36 PM

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం

Ante Sundaraniki: రంగంలోకి దూకారు.. సుందర్ మాస్టారూ.. అంటే సుందరానికి నుంచి పంచెకట్టు సాంగ్ ప్రోమో రిలీజ్..
Ante Sundaraniki
Follow us on

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నజ్రియా.. మొదటిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న మూవీ ఇది. ఈ సినిమాతోనే నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇందులో నాని సరికొత్త గెటప్‏లో కనిపించబోతుండడంతో అంటే సుందరానికీ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

రంగంలోకి దూకారు.. సుందర్ మాస్టారూ అంటూ సాగే ఈ పంచెకట్టు సాంగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ పాటను ప్రముఖ లెజెండరీ కర్ణాటక సింగర్ పద్మశ్రీ అరుణ సాయిరాం ఆలపించగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. హర్షిత్ గోలి రచించిన ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కాకుండా.. నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరోక సినిమా దసరా. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన నాని ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ

OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..