Pakka Commercial: పక్కా కమర్షియల్‌ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్‌ కమెడియన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Comedian Saptagiri: మ్యాచ్‌ స్టార్‌ గోపీచంద్ (Gopichand) , క్రేజీ బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌ (Pakka Commercial). మారుతి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు

Pakka Commercial: పక్కా కమర్షియల్‌ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్‌ కమెడియన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Comedian Saptagiri

Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

Comedian Saptagiri: మ్యాచ్‌ స్టార్‌ గోపీచంద్ (Gopichand) , క్రేజీ బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌ (Pakka Commercial). మారుతి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు ఈ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను నిర్మించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న చిత్రం జూలై 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ప్రముఖ కమెడియన్‌ సప్తగిరి (Saptagiri) ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్‌ మారుతి అతనికి చీవాట్లు పెట్టాడు. అయితే ఇదంతా నిజం కాదండోయ్. సినిమా ప్రమోషన్లలో భాగంగా టికెట్‌ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా వెరైటీగా ప్లాన్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

చిరంజీవి సినిమాలకు ఇదే చేశా..

గీతా ఆర్ట్స్‌ తమ యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్‌ టికెట్స్‌ అమ్ముతూ డైరెక్టర్‌ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా… అవును సర్‌.. సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు విక్రయిస్తున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అని సమాధానమిస్తాడు. కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్‌ అయిన సప్తగిరి అంటే మళ్లీ పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని అడుగుతాడు. దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్‌ కమర్షియల్‌ రేట్లకే ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాం. నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో ఇదే బుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక పక్కా కమర్షియల్‌ సినిమా ధరల గురించి మాట్లాడిన మారుతి .. ‘మా పక్కా కమర్షియల్‌ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల రోజులకు తీసుకెళ్లడానికి సిద్ధంగాఉండి. అందరూ హ్యాపీగా నవ్వుతూ సినిమాను ఎంజాయ్‌ చేసేందుకు పాత రేట్స్‌ కే ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. అందరూ వచ్చి మా సినిమాను ఎంజాయ్‌ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..