Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్ లో ప్రభాస్ ఫౌజి హీరోయిన్.. కారణమిదే

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ దేశంముక్త కంఠంతో ఖండిస్తోంది. అమాయకులైన ప్రాణాలు తీయడం ఎంత వరకు సబబంటూ సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఉగ్ర దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్ లో ప్రభాస్ ఫౌజి హీరోయిన్.. కారణమిదే
Prabhas, Imanvi

Updated on: Apr 23, 2025 | 7:22 PM

పహల్గామ్ ఉగ్రదాడిపై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడి ఘటనలో పాక్ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో గతంలో లాగా దాయాదిపై సర్జికల్ స్ట్రైక్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిని యావత్ భారత చిత్రసీమ ముక్త కంఠంతో ఖండించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఉగ్రవాద దాడి తర్వాత కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నారు. అందులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫౌజి సినిమా హీరోయిన్ ఇమాన్వీ అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండడమే. పాక్ మాజీ మిలటరీ అధికారి ఇక్బాల్ కుమార్తెనే ఇమాన్వి. పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన ఇమాన్వీ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో స్థిర పడింది. ఈ క్రమంలోనే ఇమాన్వీపై నెట్టింట వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫౌజి సినిమా నుంచి ఆమెను తొలగించాలంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. పాక్ నటులకు భారతీయ సినిమాల్లో అవకాశాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తున్నారు.అదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడికి, ఇమాన్వీకి ముడి పెట్టడం ఏంటని మరికొందరు నెటిజన్లు ఫౌజి హీరోయిన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా ఇమాన్వీకి ఇదే మొదటి సినిమా . అంతకు ముందు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోల ద్వారా ఆమె బాగా ఫేమస్ అయ్యింది. 1995లో పుట్టిన ఇమాన్వీ మంచి డ్యాన్సర్. వెస్ట్రన్ మాత్రమే కాదు.. భరతనాట్యం, కూచిపూడిలో ఆమెకు ప్రావీణ్యముంది. ఇందుకోసం డ్యాన్సుల్లో శిక్షణ కూడా తీసుకుందట. తెలుగు, హిందీ, తమిళంలోపాటు పలు భాషలకు చెందిన పాటలకు ఇమాన్వీ స్టెప్పులు వేస్తూ ఆ రీల్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రేజ్ తోనే ఏకంగా ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకుందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఇమాన్వీకి వ్యతిరేకంగా పోస్టులు..

మరి దీనిపై ఫౌజి మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి