Ori Devuda Review: ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే… ఓరి దేవుడా!

ఓరి దేవుడాతో ప్రేక్షకులను పలకరించారు విక్టరీ వెంకటేష్‌. తమిళంలో పెద్ద హిట్‌ అయిన ఓ మై కడవులే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఓరి దేవుడా. యూత్‌లో ఉండే మ్యారేజ్‌కి సంబంధించిన కన్‌ఫ్యూజన్స్‌ని రిఫ్లెక్ట్ చేసింది ఓరి దేవుడా.

Ori Devuda Review: ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే... ఓరి దేవుడా!
Ori Devuda Movie

Edited By: Rajitha Chanti

Updated on: Oct 21, 2022 | 6:52 PM

అక్టోబర్‌ మొదలైనప్పటి నుంచీ సీనియర్‌ హీరోలు వరుసగా థియేటర్లలోకి వస్తున్నారు. మంత్‌ స్టార్టింగ్‌లోనే చిరంజీవి, నాగార్జున స్క్రీన్‌ మీదకు వచ్చేశారు. ఇప్పుడు నా వంతు అంటూ ఓరి దేవుడాతో ప్రేక్షకులను పలకరించారు విక్టరీ వెంకటేష్‌. తమిళంలో పెద్ద హిట్‌ అయిన ఓ మై కడవులే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఓరి దేవుడా. యూత్‌లో ఉండే మ్యారేజ్‌కి సంబంధించిన కన్‌ఫ్యూజన్స్‌ని రిఫ్లెక్ట్ చేసింది ఓరి దేవుడా.

చిత్రం: ఓరి దేవుడా

సంస్థ: పీవీపీ సినిమా

ఇవి కూడా చదవండి

నటీనటులు: వెంకటేష్‌, విశ్వక్‌సేన్‌, మిథిలా పాల్కర్, ఆశాభట్‌, రాహుల్‌ రామకృష్ణ, వెంకటేష్‌ కాకుమాను, మురళీశర్మ, నాగినీడు, రాజేశ్వరి నాయర్‌ తదితరులు

సంగీతం: లియోన్‌ జేమ్స్

మాటలు: తరుణ్‌ భాస్కర్‌

కెమెరా: విధు అయ్యన్న

ఎడిటింగ్‌: విజయ్‌ ముక్కవరపు

నిర్మాత: పరమ్‌.వి.పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి

దర్శకత్వం: అశ్వత్థ్‌ మారిముత్తు

విడుదల: అక్టోబర్‌ 21, 2022

అర్జున్‌ (విశ్వక్‌సేన్‌) ఇంజనీరింగ్‌ అయిపోయిన రెండేళ్లకు సప్లీస్‌ అన్నీ క్లియర్‌ చేసి లైఫ్‌లో మంచి జాబ్‌ కోసం వెతుక్కుంటున్న అబ్బాయి. అను (మిథిలా పాల్కర్‌), మనీ (వెంకటేష్‌ కాకుమాను) చిన్నప్పటి నుంచీ అతనితో కలిసి పెరిగిన వాళ్లు. అనుకి అర్జున్‌ని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ విషయాన్నే అర్జున్‌తో చెబుతుంది. ఆమెను వద్దనడానికి పెద్దగా కారణాలు లేకపోవడంతో సరేనంటాడు. అయితే పెళ్లయ్యాక ఆమెను భార్యగా చూడలేక , మావగారి కంపెనీలో ఉద్యోగం చేయలేక సతమతమవుతుంటాడు. అప్పుడు అతనికి మీరా (ఆశాభట్‌) పరిచయమవుతుంది. అతనిలో చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్‌ని తన మాటలతో వెలికి తీస్తుంది. ఈ క్రమలో అనుకీ, అర్జున్‌కీ మధ్య దూరం పెరుగుతుంది. విషయం విడాకుల దాకా వెళ్తుంది. అప్పుడు అతని జీవితంలోకి దేవుడు (వెంకటేష్‌), సహదేవుడు (రాహుల్‌ రామకృష్ణ) వస్తారు. వాళ్లిద్దరూ ఇచ్చిన సలహాలు ఏంటి? ఒక్కసారి లైఫ్‌ని రీస్టార్ట్ చేయాల్సి వస్తే మళ్లీ అర్జున్‌ చేసిన పనేంటి? అతనికి తెలిసొచ్చిన అంశాలేంటి? మీరా లైఫ్‌లో ఉన్న బాక్సర్‌ ఎవరు? అను ప్రాక్టికల్‌ అమ్మాయా? కాదా? ఈ సినిమాలో పూరి ఎక్కడ కనిపించారు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

ఒరిజినల్‌ ఫ్లేవర్‌ని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా తెరకెక్కించడానికి చేసిన ప్రయత్నం బావుంది. అర్జున్‌ కేరక్టర్‌లో విశ్వక్‌సేన్‌ ఈజ్‌తో ఒదిగిపోయారు. వెంకటేష్‌ లుక్‌ కొత్తగా ఉంది. గోపాలాగోపాలాలో కామన్‌ మేన్‌గా నటించిన వెంకటేష్‌, ఈ సినిమాలో మోడ్రన్‌ గాడ్‌గానూ మెప్పించారు. తరుణ్‌ భాస్కర్‌ రాసిన డైలాగులు సందర్భోచితంగా ఉన్నాయి. లైఫ్‌లో కొన్నిసార్లు అన్నీ ఉన్నా, ఏదో అసంతృప్తి మొదలవుతుంది. వైవాహిక జీవితంలో అక్కడక్కడా కనిపించే ఆ లోటును సున్నితంగా ప్రస్తావించారు డైరక్టర్‌. పాటలు బావున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరికి పెళ్లయితే వచ్చే సమస్యలు, ఒకరి పట్ల ఒకరికి ఉండే బాధ్యతను చెప్పిన సినిమా ఓరిదేవుడా. సరదాగా చూడొచ్చు.

– డా. చల్లా భాగ్యలక్ష్మి