Jr NTR : ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న ఫోటో.. ఆయనతో పాటు మరో హీరోది కూడా.. నెట్టింట వైరల్
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు తారకరత్న. విదేశీ వైదులు సైతం ఆయనను బ్రతికించేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

వేలమంది అభిమానులను విషాదంలోకి నెట్టేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు నందమూరి తారకరత్న. చికిత్స తీసుకునొని కోలుకొని తిరిగి వస్తారనుకున్నా అందరిని నిరాశపరిచారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు తారకరత్న. విదేశీ వైదులు సైతం ఆయనను బ్రతికించేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక అన్న మరణ వార్త తెలిసి జూనియర్ ఎన్టీఆర్ తల్లడిలిపోయారు. తారకరత్నకు ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నా తమ్ముడు అంటూ ఎంతో ఆప్యాయంగా ఉంటారు తారకరత్న. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న, పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక గోడకు పైన తారకరత్న ఫోటో, అలాగే కింద పునీత్ రాజ్ కుమార్ ఫోటో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఒకటో నంబర్ కుర్రాడు.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారకరత్న వ్యక్త్విత్వం తెలిసినవాళ్లు అతని గురించి చెప్పే మాట ఇదే. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటూ తిరిగే వ్యక్తి ఇవాళ తమ మధ్య లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇవాళ చాంబర్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైతే ప్రతినాయకుడిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇలా అకాలమరణం చెందడం అందరి హృదయాల్నీ కలచివేస్తోంది.
Tarakaratna
