Dance IKON 2: ఆహాలో వైల్డ్ ఫైర్‌లాంటి డ్యాన్స్ షో.. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో
కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. థియేటర్స్ ఆ సమయంలో మూతపడటంతో ఓటీటీలే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కూడా ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలు ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతుంది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది ఆహా. అలాగే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేసింది ఆహా. 2022 ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?
ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు.ఇప్పుడు మరోసారి ఈ డాన్సింగ్ షో మన ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం డాన్స్ ఐకాన్ 2 కోసం ఆడిషన్స్ జరిగాయి. అన్ని పనులు పూర్తి చేసుకున్న డాన్స్ ఐకాన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డాన్స్ షో ఎప్పుడు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి
ఈ క్రమంలోనే తాజాగా డాన్స్ ఐకాన్ 2 కు సంబందించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ త్వరలోనే రానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు టీమ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి