చాలా కాల గ్యాప్ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇదివరకు విడుదలైన రెండు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను క్రేజీ హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రితేష్ జి రావు అద్భుతమైన గాత్రం.. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసారు. హీరోయిన్ ను చూస్తూ మైమరిచిపోయి హీరో పాడే పాట ఇది. ఈ సాంగ్ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది.
ఈ పాటలో చూపించిన కోల్ కత్త అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 5న ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన నటించిన అన్ని సినిమాల కంటే ఈ మూవీలో హీరో లుక్స్ కాస్త భిన్నంగా ఉండనున్నాయి. ఇందులో ఖుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సత్య, సప్తగిరి కీలకపాత్రలోల నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.