Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ.. చత్రపతి రీమేక్‌లో ఆ హీరోయిన్..
బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం అనుదుకోలేక పోతున్నాడు. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ ఆ తర్వాత హిట్లు ఫ్లాప్‌లతో..
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం అనుదుకోలేక పోతున్నాడు. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ ఆ తర్వాత హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కుర్రహీరో.. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. పెన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బెల్లంకొండను పరిచయం చేసిన వివినాయకే బాలీవుడ్‌లోను పరిచయడం చేయడం విశేషం.. ఇక అక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా విజయేంద్రప్రసాద్ ఈ రీమేక్‌లో మార్పులు చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.
కాగా 2005లో ప్రభాస్ హీరోగా రాజమౌళి ఛత్రపతిని తెరకెక్కించారు. ఇందులో శ్రియ హీరోయిన్‌గా నటించగా.. భానుప్రియ, షమీ, ప్రదీప్ రావత్, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు ప్రభాస్‌కి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకూడా బెల్లంకొండపై సక్సెస్ తెచ్చిపెడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట చిత్రయూనిట్. బాలీవుడ్ హాటీ నుష్రత్ బరుచాను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట చిత్రయూనిట్. ఈ ఆఫర్ ఆమెకు వచ్చడంతో నుష్రత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. నుష్రత్ 2010 లో విడుదలైన `తాజ్ మహల్` చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆతర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.
మరిన్ని ఇక్కడ చదవండి :