మన తెలుగు హీరోల లైనప్‌లో 29వ మూవీ అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. వాటెబౌట్ ట్వంటీనైన్త్ అని ప్రతి హీరో కెరీర్‌నూ ఆరా తీస్తున్నారు. అటు.. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ని కూడా నంబర్ ట్వంటీనైన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఇరవైతొమ్మిదో కథేమిటంటే.. ఎన్టీయార్ 28వ మూవీ అరవిందసమేత. దాంతో వచ్చిన క్రేజ్‌ని మూడేళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంటాక్ట్‌గా ఉంచేసింది.. 29వ సినిమా ట్రిపులార్. రాజమౌళి-యంగ్‌టైగర్ కాంబినేషన్‌లో ఇది నాలుగో బ్లాక్‌బస్టర్. అటు.. మహేష్‌బాబు త్రివిక్రమ్‌తో చెయ్యబోయే 28వ మూవీ తర్వాత జక్కన్నతో సినిమాను లైన్‌లో పెట్టేశారు. సో… సూపర్‌స్టార్‌కి పాన్ ఇండియా ఎలివేషన్ ఇవ్వబోయేది కూడా ట్వంటీనైన్త్ మూవీయే అన్నమాట.
మరి… పవర్‌స్టార్ కెరీర్‌లో ఇరవైతొమ్మిదో మూవీ మేటరేంటి.? అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్‌మార్క్‌గా మారిపోయింది. సిల్వర్‌జూబ్లీ మూవీ అజ్ఞాతవాసి అడ్డం తిరిగినా, 26వ సినిమా వకీల్‌సాబ్, 27వ సినిమా భీమ్లానాయక్ స్ట్రెయిట్ హిట్ కొట్టేశాయి. ఆ తర్వాత PSPK28గా ప్రమోటౌతున్న హరీష్‌శంకర్ మూవీ వెనక్కెళ్లిపోయింది. ఇప్పటికైతే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లును పవన్ 28వ మూవీ. మరి…పవర్ స్టార్ ట్వంటీనైన్త్ మూవీ ఏ డైరెక్టర్‌తో అనేదే ఇప్పుడు బిగ్ ఫజిల్.
మైత్రీ సంస్థ కోసం కమిటైన హరీష్‌శంకర్ మూవీ త్వరలో సెట్స్ మీదికెళ్తున్నట్టు ఎప్పటికప్పుడు సిగ్నల్స్ వస్తూనే వున్నాయి. ఈలోగా సముద్రఖని డైరెక్షన్‌లో పవన్-సాయిధరమ్ హీరోలుగా ఒక రీమేక్ ఇన్‌క్లూడైంది. ఈ రెండు సినిమాల్ని అటుంచి లేటెస్ట్‌గా డీవీవీ దానయ్యతో కమిటయ్యారట పవర్‌స్టార్. చాలా కాలంగా ఖాళీగా వున్న సాహో డైరెక్టర్ సుజీత్ ఈ ప్రాజెక్ట్‌ని డీల్ చేస్తారన్నది తాజా ఖబర్. కోలీవుడ్ దళపతి హీరోగా చేసిన తెరి మూవీకి రీమేక్‌గా రాబోయే ఈ మూవీలో పవన్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. మిగతా సినిమాల్ని పక్కకు జరిపి దీనికే బెటర్ ప్రయారిటీ ఇస్తారని కూడా చెబుతున్నారు. సో.. టాలీవుడ్‌లో సెంటిమెంట్‌గా మారిన ట్వంటీనైన్త్ నంబర్ పవన్‌కల్యాణ్ కెరీర్‌లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :