టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌పుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫ్యాన్స్‌తో ఎంతో ఆతృతగా ఎన్టీఆర్ 30 అప్‌డేట్ గురించి ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ అనౌన్స్‌మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం కొరటాల శివ తన టీమ్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని అందించటానికి సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను మెప్పించేలా రూపొందున్న ఈ పవర్ ఫుల్ సబ్జెక్ట్‌పై ఎంటైర్ యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మాసీవ్ పాన్ ఇండియా మూవీకి యువ సంగీత సంచలన అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొరటాల శివకు సన్నిహితుడైన మిక్కినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.