Not A Common Man Movie : విశాల్‌ -31 నాట్ ఏ కామన్ మ్యాన్.. అదరగొడుతున్న కొత్త సినిమా ప్రీ లుక్‌.. ఫిదా అవుతున్న అభిమానులు..

Not A Common Man movie : ఇటీవల చక్ర విజయంతో మంచి ఊపుమీదున్న విశాల్ తాజాగా నాట్ ఏ కామన్ మ్యాన్ సినిమాతో ముందుకు రాబోతున్నాడు. విశాల్ తన 31వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘నాట్

Not A Common Man Movie : విశాల్‌ -31 నాట్ ఏ కామన్ మ్యాన్.. అదరగొడుతున్న కొత్త సినిమా ప్రీ లుక్‌.. ఫిదా అవుతున్న అభిమానులు..
Not A Common Man Movie

Updated on: Apr 02, 2021 | 8:46 PM

Not A Common Man movie : ఇటీవల చక్ర విజయంతో మంచి ఊపుమీదున్న విశాల్ తాజాగా నాట్ ఏ కామన్ మ్యాన్ సినిమాతో ముందుకు రాబోతున్నాడు. విశాల్ తన 31వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ ట్యాగ్ లైన్‌తో విశాల్ ప్రీలుక్ ఆసక్తి రేపుతుండగా… ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నడుస్తున్న జనసందోహం నుంచి హీరో ఫేస్‌ను చూపించిన మేకర్స్.. కోపంతో రగిలిపోతున్న తన కళ్లను హైలెట్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమా రూపొందుతుండగా.. తు.ప.శరవణన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు బాలసుబ్రమణ్యం తీసుకోగా.. ఎస్ఎస్ మూర్తి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎన్‌బి శ్రీకాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా ప్రకటిస్తామన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. విశాల్, ఆర్య కలసి మరోసారి నటిస్తున్న సినిమా ‘ఎనిమి’. దాదాపు పదేళ్ళ క్రితం ‘అవన్ ఇవన్’లో కలసి నటించి హిట్ కొట్టారు వీరిద్దరు. ఇప్పుడు మరోసారి ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

దాదాపు 30 రోజుల పాటు దుబాయ్ లో సినిమా షెడ్యూల్ జరిగింది. దాదాపు 50 అడుగుల ఎత్తైన బిల్డింగ్ మీదనుంచి విశాల్ దూకటం వంటి కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం చెన్నైలో ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది యూనిట్. ప్రకాశ్ రాజ్, మమతా మోహన్ దాస్, మృణాలిని రావి ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు. మరి అవన్ ఇవన్ తో మెప్పించిన విశాల్, ఆర్య మరోసారి ‘ఎనిమి’తో ఆకట్టుకుంటారేమో చూడాలి.

Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ మూవీ ఎలా ఉందంటే..

Komaki MX3 Electric Bike : సింగిల్ చార్జిపై 100 కిలోమీటర్ల ప్రయాణం.. బ్లూటూత్ క‌నెక్టివిటీ.. డ‌బుల్ డిస్క్ బ్రేక్‌లు.. అతి తక్కువ ధర..

Taiwan train crash : సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు.. డ్రైవర్‌ సహా 51కి చేరిన మృతులు, 146 మందికి తీవ్ర గాయాలు