Niharika: వేసవి త్వరగా రావాలని కోరుకుంటున్న మెగా డాటర్‌ నిహారిక.. కారణమేంటో తెలుసా..?

Niharika Reaction On Acharya Teaser: కొన్నేళ్లపాటు రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన విషయ తెలిసిందే. ఈ సినిమాతో..

Niharika: వేసవి త్వరగా రావాలని కోరుకుంటున్న మెగా డాటర్‌ నిహారిక.. కారణమేంటో తెలుసా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2021 | 3:14 PM

Niharika Reaction On Acharya Teaser: కొన్నేళ్లపాటు రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన విషయ తెలిసిందే. ఈ సినిమాతో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు చిరు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన ‘సైరా నర్సింహా రెడ్డి’ అంచనాలు అందుకోలేకపోయినా చిరులోని నట విశ్వరూపాన్ని మరోసారి చూపించింది. సైరా.. తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న చిరు తాజాగా ఒకేసారి మూడు సినిమాలతో బిజీగా మారారు. కొరటాల శివతో ఆచార్య, లూసిసఫర్‌ రీమేక్‌తోపాటు వేదాళం రీమేక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు చిరు. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. శుక్రవారం విడుదలైన ఈ టీజర్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. టీజర్‌లో మాస్‌ పంచ్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ సీన్‌లతో చిరు అభిమానులు మెస్మరైజ్ చేశాడు. ఇక చిత్రయూనిట్‌ టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. అభిమానుల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఆచార్య చిత్రాన్ని మే13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మెగా డాటర్ నిహారిక పోస్ట్ చేసిన ట్వీట్..

ఈ నేపథ్యంలో మెగా డాటర్‌ నిహారిక ట్విట్టర్‌ వేదికగా ఆచార్య టీజర్‌ను పోస్ట్‌ చేయడంతోపాటు ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. టీజర్‌ అద్భుతంగా ఉందని చెబుతూనే.. తనకు వేసవి త్వరగా రావాలని ఉందని.. వేసవి ముందుగానే వస్తుందా.? అంటూ పేర్కొంది. తను ఆచార్య చిత్రం కోసం ఎంతలా ఎదురుచూస్తుదో ఇలా చెప్పకనే చెప్పిందన్నమాట. ఇక ఆచార్య చిత్రంలో రామ్‌ చరణ్‌ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో చెర్రీకి జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. మరి అపజయం ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి .

Also Read: Chiranjeevi’s ‘Acharya’ : మెగాస్టార్ ‘ఆచార్య’ సెట్‌‌‌‌‌‌లో ప్రత్యక్షమైన తెలంగాణ రవాణా శాఖ మంత్రి..

టాలీవుడ్‏లో మరో మల్టీస్టారర్ మూవీ ? పెద్ద హిట్టు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్న యంగ్ హీరోలు..