Chiranjeevi’s ‘Acharya’ : మెగాస్టార్ ‘ఆచార్య’ సెట్‌లో ప్రత్యక్షమైన తెలంగాణ రవాణా శాఖ మంత్రి..
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi’s ‘Acharya’ : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ.. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. టీజర్ రిలీజ్ చేసిన అతి కొద్ది గంటల్లోనే రికార్డుల మోత మోగింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ నెంబర్ వన్ లో ఉంది కాగా తాజాగా ఈ షూటింగ్ లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్ కు అజయ్ హాజరయ్యారు. మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్ ట్వీట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు ఆయన షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాణంలో ఈ సినిమా సినిమాలో చరణ్ కు జోడీగా కాజల్ నటిస్తుంది.
ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. Megastar @KChiruTweets గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ. ఎం pic.twitter.com/INwVEVjduo
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
ఎవరు మా ఇంటికి రావొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు కారణం ఎంటంటే ?