AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేసిన కొత్త జంట.. అందమైన లోకేషన్లలో విహరిస్తూ.. గుర్తు పట్టారా?

హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీ, పెళ్లి, రిసెప్షన్‌, వివాహానరంతరం జరిగే కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. అంతుకు ముందు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతూ దేశమంతా చుట్టేశారు. ఇలా గత కొన్ని రోజులుగా ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లిపోయారు

Tollywood: పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేసిన కొత్త జంట.. అందమైన లోకేషన్లలో విహరిస్తూ.. గుర్తు పట్టారా?
Tollywood New Couple
Basha Shek
|

Updated on: Jul 07, 2024 | 7:57 AM

Share

పై ఫొటోలో అల్లుకుపోయిన కొత్త జంటను గుర్తు పట్టారా? వీరికి ఇటీవలే వివాహమైంది. హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీ, పెళ్లి, రిసెప్షన్‌, వివాహానరంతరం జరిగే కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. అంతుకు ముందు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతూ దేశమంతా చుట్టేశారు. ఇలా గత కొన్ని రోజులుగా ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లిపోయారు. అందమైన లోకేషన్లలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ కొత్త జంట ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. వీరు ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పక్షులు ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిషతో సహా పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవలే చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, బాలకృష్ణతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. కొత్త జంటను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

వరలక్ష్మి పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్..

కాగా పెళ్లైన వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు వరలక్ష్మి, నికోలయ్ సచ్ దేవ్. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తమ హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర చేస్తున్నారు. ‘తుపాన్‌ తరువాత ప్రశాంతత’ అంటూ వరలక్ష్మి షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా థాయ్ లాండ్ లో ఏడడుగులు నడిచిన ఈ ప్రేమ జంట హనీమూన్ కు ఎక్కడ వెళ్లారో మాత్రం చెప్పడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..