
Shekar Kammula Dhanush: మరో అద్భుత పాన్ ఇండియా చిత్రానికి నాంది పడింది. క్లాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.. తమిళ స్టార్ హీరోల్లో ఒకరు, విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన ధనుష్‌తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన చేశారు. సినిమా రానుందన్న ఒక్క వార్తతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ లీక్ కావడం మొదలయ్యాయి.
ఈ క్రంమలోనే తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌కు సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించనుందని సదరు వార్త సారాంశం. శేఖర్ దర్శకత్వం వహించిన ఫిదా చిత్రంతోనే సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమైందన్న విషయం తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం లవ్‌స్టోరీలోనూ సాయి పల్లవి నటిస్తోంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ఇది వరకు ధనుష్‌తో నటించిన విషయం విధితమే. వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మరో సారి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Saipallavi
Also Read: ముద్దుల కొడుక్కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన ‘రియల్ హీరో’ ! ఏమిటా కథ ? ఏమిటా గిఫ్ట్ ..?
Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో
Radhe Shyam: ‘రాధేశ్యామ్’ లో ప్రభాస్ కామెడీ నెక్ట్స్ లెవల్.. హింట్ ఇచ్చిన ఆ కమెడియన్