Salman Khan: ‘రూ. 5 కోట్లు ఇవ్వండి.. లేదంటే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతాం’.. సల్మాన్‏కు మరోసారి బెదిరింపులు..

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ తో ఉన్న వైరాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటే నటుడు రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేదంటే బాబా సిద్ధిఖీ హత్య కంటే సల్మాన్ పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Salman Khan: 'రూ. 5 కోట్లు ఇవ్వండి.. లేదంటే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతాం'.. సల్మాన్‏కు మరోసారి బెదిరింపులు..
ఈ వారం ఎపిసోడ్స్‌లో మాత్రం సల్మాన్ కనిపించటం లేదు. ప్రజెంట్ సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు సల్మాన్‌.
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2024 | 10:20 AM

లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న పేరు. ముంబైలోనే తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని.. బాలీవుడ్ ఇండస్ట్రీపై పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్న గ్యాంగ్ స్టర్. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుంది బిష్ణోయ్ వర్గం. తాము ఆరాధించే కృష్ణజింకను గతంలో సల్మాన్ వేటాడాడని.. అందుకే అతడిని చంపాలనుకుంటున్నట్లు ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించింది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు షూటర్స్ గన్ ఫైరింగ్ జరిపారు. ఇక ఇటీవల ఎన్సీపీ నేత, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి క్షణం సల్మాన్ రక్షణ కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చనిపోతారని బెదిరించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిందితుడు ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం పంపాడు.

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలి.. అలాగే లారెన్స్ బిష్ణోయ్‌తో తన వైరాన్ని ముగించాలనుకుంటే.. అతడు రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. లేదంటే బాబా సిద్ధిఖీ కంటే సల్మాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో బెదిరింపు లేఖపై విచారణ ప్రారంభించారు ముంబై పోలీసులు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు పథకం పన్నారనే అభియోగంపై సుఖా అనే షూటర్ ను హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ చేసి ముంబై తరలించిన సంగతి తెలిసిందే. గురువారం అతడిని కోర్టులు హాజరుపరిచారు. జూన్ 1న పన్వెల్‌లో సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై షూటింగ్ జరిగింది.

ఇది చదవండి : Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం హర్యానాలో నిందితుడు సుఖాను అరెస్ట్ చేశారు. సల్మాన్ హత్యకు పథకం పన్నిన నిందితుల కోసం గత మూడు నెలలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనను, తన కుటుంబ సభ్యులను చంపే ఉద్దేశంతో తన నివాసంపై కాల్పులు జరిపిందని సల్మాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసిన లారెన్స్ బిష్ణోయ్ 60 మంది షూటర్లను నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇది చదవండి : Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.