Samantha: ‘అప్పుడు నచ్చనిది ఇప్పుడేలా నచ్చింది’.. సమంతను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్స్..

ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు సామ్. ఇటీవలే ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. అయితే తాజాగా ఆమె పదేళ్ల క్రితం సామ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ ట్వీట్ మరోసారి రీట్వీట్ చేస్తూ... కర్మ ఈజ్ బ్యాక్ అంటూ సమంతకు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్స్. ఇంతకీ మరోసారి నెట్టింట సామ్ ను ట్రోల్ చేయాడానికి కారణమేంటో తెలుసుకుందామా.

Samantha: అప్పుడు నచ్చనిది ఇప్పుడేలా నచ్చింది.. సమంతను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్స్..
Samantha

Updated on: Jul 13, 2023 | 6:50 PM

గత కొంత కాలంగా సమంత పేరు నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్‏కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది. ఇక కొన్నిసార్లు సామ్ సైతం తనపై వచ్చే రూమర్స్ పై.. ట్రోల్స్ పై పరొక్షంగా స్పందిస్తుంటారు. ఓవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు సామ్. ఇటీవలే ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. అయితే తాజాగా ఆమె పదేళ్ల క్రితం సామ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ ట్వీట్ మరోసారి రీట్వీట్ చేస్తూ… కర్మ ఈజ్ బ్యాక్ అంటూ సమంతకు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్స్. ఇంతకీ మరోసారి నెట్టింట సామ్ ను ట్రోల్ చేయాడానికి కారణమేంటో తెలుసుకుందామా.

2013లో టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ఓ సినిమా పోస్టర్ పై సామ్ రియాక్ట్ అయ్యింది. అందులో హీరో నడుస్తుండగా.. అతడిని అనుసరిస్తూ హీరోయిన్ మోకాళ్లపై వెళ్తుంటుంది. అప్పట్లో ఈ పోస్టర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక అదే సమయంలో సామ్ ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. “ఇంకా విడుదల కానీ ఓ ఓ తెలుగు సినిమా పోస్టర్ చూశాను. ఇది చాలా దారుణంగా ఉంది” అంటూ ట్వీట్ చేసింది. అయితే అప్పుడు మహిళలను తక్కువ చేశారనే ఉద్దేశంతో సామ్ ఆ ట్వీట్ చేసింది. ఇక ఇప్పుడు అదే ఆమెకు సమస్యగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే.. ఆమె నటించిన ఖుషి చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఆరాధ్య పాట ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో సామ్, విజయ్ జంటగా నటించారు. అయితే బుధవారం విడుదలైన ఆరాధ్య పాటలోని ఓ సన్నివేశంలో విజయ్.. ఆమె భుజాన్ని కాలుతో తడుతూ కనిపించారు. ఇంకేముంది ఆ సీన్ చూసిన నెటిజన్స్ ఆ పోస్టర్ షేర్ చేస్తూ కర్మ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అప్పుడు మీకు నచ్చలేదు.. ఆ పోస్టర్..ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ? మేడమ్.. ఒకరిని అనే ముందు మనకూ అదే పరిస్థితి వస్తుందేమో అనుకుంటే అదే జీవితం… రాదు అనుకుంటే కర్మ.. ఇది గుర్తుపెట్టుకోండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఖుషి చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.