Upasana Konidela: మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి.. మెగా కోడలి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. కారణం ఇదే..

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. వ్యాపారంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

Upasana Konidela: మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి.. మెగా కోడలి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. కారణం ఇదే..
Upasana

Updated on: Jan 27, 2022 | 10:26 AM

Upasana Konidela: మెగా కోడలు, రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన(Upasana Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. వ్యాపారంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా.. అపోలో అధినేత మనరాలిగా.. అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్‏ రంగంలో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ ఫిట్ నెస్, ఆరోగ్యంకు సంబంధించిన అప్డేస్ట్స్ షేర్ చేస్తుంటారు. సామాజిక సేవ కార్యక్రమాలను చేయడంలో ఉపాసన కొణిదెల ముందుంటారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసనని  తాజాగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్. గుడి గోపురం పైన దేవుళ్ళ ఫోటోల బదులు, సినీ స్టార్స్ బొమ్మలతో పెయింట్ వేసిన పిక్ ని పోస్ట్ చేశారు ఉపాసన. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్ల నుంచే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఉపాసన పై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు ఇటువంటి ఫొటోస్ పెట్టి మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి, ఈ పోస్ట్ మీరు షేర్ చేశారంటే మీకు హిందూ దేవుళ్ళ పై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది అంటూ.. కామెంట్స్  చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటోలో సినిమా స్టార్స్ అందరు గుడి గోపురం పై చెప్పులతో నిలుచున్నట్టుగా ఎడిట్ చేశారు. నెటిజన్లు విమర్శిస్తున్నా ఉపాసన ఈ పోస్ట్ డిలీట్ చేయకపోవడం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో