Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: Part 1: అక్కడ ఉంది ప్రభాస్ గురూ..! రికార్డ్ ధరకు సలార్ ఓటీటీ రైట్స్..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్ ఓవర్ ఆల్ గా ఈ సినిమా 1000కోట్లు దాటి వసూల్ చేస్తుందని అంటున్నారు సినిమా చూసిన అభిమానులు .

Salaar: Part 1: అక్కడ ఉంది ప్రభాస్ గురూ..! రికార్డ్ ధరకు సలార్ ఓటీటీ రైట్స్..
Salaar 1st day collections
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2023 | 3:38 PM

సలార్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సలార్ సినిమా నేడు(డిసెంబర్ 22)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్ ఓవర్ ఆల్ గా ఈ సినిమా 1000కోట్లు దాటి వసూల్ చేస్తుందని అంటున్నారు సినిమా చూసిన అభిమానులు . ఇక సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకాలం ప్రభాస్ ను ఎలా చూడాలని అనుకున్నామో అలా చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

సలార్ సినిమా ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథ. తన స్నేహితుడి కోసం ప్రభాస్ చేసే యుద్ధంమే సలార్ సినిమా. ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ మూవీ డిజిటల్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. సలార్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో భారీ ధరకు ఆ ఓటీటీ సంస్థ సలార్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

సలార్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇప్పటికే బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇప్పుడు డిజిటల్ రైట్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. రూ.350కోట్లకు సలార్ సినిమా రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అక్కడ ఉంది ప్రభాస్ ఆ మాత్రా ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్.  ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.