AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: ‘నా తమ్ముడు ప్రశాంత్‌ అమాయకుడు.. తప్పంతా వారిదే’ రైతు బిడ్డ అరెస్ట్‌పై అశ్విని శ్రీ ఆవేదన

పల్లవి ప్రశాంత్‌ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు బిడ్డను అరెస్ట్‌ చేయడం అన్యాయమని, అతనితో పాటు బిగ్‌ బాస్‌ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. నటుడు శివాజీ కూడా రైతు బిడ్డ త్వరలోనే బయటకు వస్తాడంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. తాజాగా బిగ్‌ బాస్‌ మరో కంటెస్టెంట్‌ అశ్విని పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌పై స్పందించారు.

Pallavi Prashanth: 'నా తమ్ముడు ప్రశాంత్‌ అమాయకుడు.. తప్పంతా వారిదే' రైతు బిడ్డ అరెస్ట్‌పై అశ్విని శ్రీ ఆవేదన
Pallavi Prashanth, Ashwini
Basha Shek
|

Updated on: Dec 22, 2023 | 3:02 PM

Share

గతంలో ఎన్నడూ లేనతంగా బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షో వార్తల్లో నిలుస్తోంది. ఏడో సీజన్‌ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ కావడమే ఇందుకు కారణం. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిశాక జరిగిన అల్లర్లు, వాహనాల విధ్వంసం కేసులో రైతు బిడ్డపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన అల్లర్లలో ఆరు ఆర్టీసీ బస్సులతో పాటు అమర్‌ దీప్‌ చౌదరి, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ తదితర సెలబ్రిటీల కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసులపై విచారణ సాగుతోంది. మరోవైపు పల్లవి ప్రశాంత్‌ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు బిడ్డను అరెస్ట్‌ చేయడం అన్యాయమని, అతనితో పాటు బిగ్‌ బాస్‌ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. నటుడు శివాజీ కూడా రైతు బిడ్డ త్వరలోనే బయటకు వస్తాడంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. తాజాగా బిగ్‌ బాస్‌ మరో కంటెస్టెంట్‌ అశ్విని పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌పై స్పందించారు. అతను అమాయకుడని, త్వరలోనే బయటకు వస్తాడని తెలిపింది.

‘పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది అసలు కరెక్ట్‌ కాదండి. ఓ కామన్‌ మ్యాన్‌గా వచ్చి బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచాడు. పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి? అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ప్రశాంత్ చాలా అమాయకుడు, మంచి వ్యక్తి కూడా. బిగ్‌ బాస్‌ ట్రోఫీ గెలిచి ఒక్కరోజు ముగియకుండానే అతనిని అరెస్ట్ చేశారు. ట్రోఫీ గెలిచారన్న సంతోషం కూడా లేకుండా చేశారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్‌కు అందరూ మద్దతుగా నిలవండి. గ్రాండ్‌ ఫినాలే తర్వాత జరిగిన అల్లర్లు తప్పే. ఇది అత్యుత్సాహంతో అభిమానులు చేసిన పొరపాటు. ఇందులో పల్లవి ప్రశాంత్‌ది తప్పేం లేదు. దయచేసి రైతు బిడ్డను రిలీజ్‌ చేయాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చింది అశ్విని శ్రీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు, నెటిజన్లు పల్లవి ప్రశాంత్‌ కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అభిమానుల దాడిలో ధ్వంసమైన అశ్విని కారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..