
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబాన్ని కలిసి కాసేపు ముచ్చటించారు. చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి.. చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డతో మాట్లాడారు. ఇక నిన్న శుక్రవారం నందమూరి ఫ్యామిలిని కలిసిన సంగతి తెలిసిందే. నెట్‍ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కాసేపు తారక్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడు.
ఈరోజు గుంటురు కారం సెట్లో ఉన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరిని కలిశారు నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. వారితో కలిసి దిగిన ఫోటోను మహేష్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సంరడోస్.. అతని టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన కొన్ని విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా..నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ టెడ్ సరండోస్ ఆకస్మాత్తుగా మాట్లాడటం చూస్తుంటే టాలీవుడ్ సినీ స్టార్లతో నెట్‍ఫ్లిక్స్ ఏదైనా మూవీ లేదా సిరీస్ ప్లాన్ చేస్తుందా ?.. అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
Coffee and chill!!
Some interesting conversations about the future of entertainment with the visionary #TedSarandos and his fabulous team #MonikaShergill #AbhishekGoradia@NetflixIndia pic.twitter.com/lpoXqMWz05— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2023
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Let’s kick it off with #DumMasala 🔥https://t.co/mp6DvRkV0L#Trivikram @MusicThaman @ramjowrites #SanjithHegde #JyotiNooran @sreeleela14 @Meenakshiioffl @manojdft @NavinNooli #ASPrakash @nagavamsi19 @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.