కేజీఎఫ్-2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు హీరో యశ్. అయితే ఈ గ్యాప్ ను కవర్ చేస్తూ అభిమానులకు మంచి సినిమాను అందిస్తానంటున్నాడీ పాన్ ఇండియా హీరో. యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం టాక్సిక్ . కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘టాక్సిక్’ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీలో నటించే హీరోయిన్ల గురించి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. కరీనా కపూర్, కియారా అద్వానీ, నయనతార.. ఇలా స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధికారిక ప్రకటనలేవీ రాలేదు.
ఈ క్రమంలో టాక్సిక్ లో నయన తార నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు అక్షయ్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యశ్ సినిమా టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. ఇంతకు మించి వివరాలు నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి మీరు నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ కీలక ప్రకటన విడుదల చేసి చెప్తారు. అప్పటి వరకు వేచి చూడండి ‘ అని అక్షయ్ చె్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నయన తార యశ్ సరసన నటిస్తుందా.. లేక మరేదైనా పాత్రలో నటించబోతుందా? అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు.
యశ్ టాక్సిక్ గురించి అక్షయ్ ఓబెరాయ్ కామెంట్స్.. వీడియో ఇదిగో..
CONFIRMED Nayanthara is a part of Yash-led ‘Toxic#Nayanthara #Yash
Akshay Oberoi About #TOXICTheMoviepic.twitter.com/HCs0HlT1ND— NayanAnu (@AnuNayanFan) January 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.