Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం

విభిన్నమైన కథ లతో వస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాయి. చిన్న సినిమాలైనా కథ ఆసక్తికరంగా ఉంటే చాలు సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది.

Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
Naveen Polishetty

Updated on: Mar 29, 2022 | 8:48 PM

విభిన్నమైన కథ లతో వస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాయి. చిన్న సినిమాలైన కథ ఆసక్తికరంగా ఉంటే చాలు సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో హీరోయిన్స్ కూడా దర్శకుడితో పనిలేకుండా కథను నమ్మి సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మిషన్ ఇంపాజిబుల్(Mishan Impossible)అనే ఆసక్తికర సినిమాను నిర్మించింది. చాలా కాలం విరామం తర్వాత తెలుగులో తాప్సీ పన్నుకు ఈ చిత్రం రీ ఎంట్రీ ఇవ్వనుంది`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తోపాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అదనపు బోనస్ అవుతుంది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్కు అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం మరింత హైప్ క్రియేట్ చేసింది. నమ్మశక్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ తన అద్భుతమైన రచన, టేకింగ్ తో కమర్షియల్ హంగులు జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అన్ని కమర్షియల్ అంశాలతోవుంటూ యాక్షన్, థ్రిల్లింగ్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందింది. దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..