AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాహో దెబ్బకు నాచురల్ స్టార్ విలవిల..

ప్రభాస్ వేసిన గూగ్లీకి నాని ఔట్ అయ్యాడు. గ్యాంగ్ లీడర్ హీరోకి అనుకోకుండా ఝలక్ తగిలింది. నాని ఇప్పుడు ప్రభాస్ మీద కస్సుబుస్సులాడే సీన్ ఉంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఈ తంటా వచ్చిపడింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో చెప్పిన డేట్‌కి విడుదల చేయలేమంటూ చేతులెత్తేశారు. అప్పటికల్లా మూవీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయలేమని టెక్నీషియన్లు హాండ్సప్ చెప్పేశారట. దీంతో ఈ మూవీ […]

సాహో దెబ్బకు నాచురల్ స్టార్ విలవిల..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2019 | 6:46 AM

Share

ప్రభాస్ వేసిన గూగ్లీకి నాని ఔట్ అయ్యాడు. గ్యాంగ్ లీడర్ హీరోకి అనుకోకుండా ఝలక్ తగిలింది. నాని ఇప్పుడు ప్రభాస్ మీద కస్సుబుస్సులాడే సీన్ ఉంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఈ తంటా వచ్చిపడింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో చెప్పిన డేట్‌కి విడుదల చేయలేమంటూ చేతులెత్తేశారు. అప్పటికల్లా మూవీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయలేమని టెక్నీషియన్లు హాండ్సప్ చెప్పేశారట. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి సాహో ఆగస్టు 30న విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అందుకే నానీ తెగ వర్రీ అయిపోతున్నాడట.

విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో నానీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. నిన్న మొన్నటి వరకు ఈ మూవీ గురించి పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. అయితే సాహో రిలిజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యిందని తెలియగానే తన సినిమాకు ప్రొమోషన్ వర్క్స్ హడావిడిగా మొదలు పెట్టేశాడు. సరిగ్గా ఆగస్టు 30 తేదీనే తన సినిమా థియేటర్లకు వస్తుందని చెబుతూ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసేశాడు. అయితే ఒకవేళ నిజంగా సాహో ఆగస్టు 30న విడుదలకు రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా నానీ తన మూవీని వాయిదా వేసుకోవడం తప్పనిసరి. మరోవైపు ఇదే కోవలో తమిళ హీరో సూర్యతో సహా పలు చిత్రాలకు కూడా డేట్స్ మార్చుకోవాల్సి రావచ్చంటున్నారు సినీ వర్గాలు.

ఇదిలా ఉంటే ప్రభాస్ మూవీతో నానీ అష్టకష్టాలు పడుతుంటే..అడవి శేష్, శర్వానంద్‌లు మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారట. ఎందుకంటే సాహో ముందు చెప్పిన డేట్ ఆగస్టు 15న వీరిద్దరి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అడవి శేష్ నటించిన “ఎవరు”, శర్వానంద్ “రణరంగం” చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయట. మొత్తానికి నానీకి వచ్చిన కష్టం మరో ఇద్దరికి సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట.

Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..