AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. మూడు జాతీయ అవార్డులు.. ఇప్పుడేమో చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్.. ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దిగ్గజ నటీమణుల్లో ఈ అందాల తార కూడా ఒకరు. ఎన్నో వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. మరికొన్ని సినిమాల్లో సహాయక నటిగా అలరించారు. తన నటనా ప్రతిభకు మూడు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.. కానీ ఇప్పుడేమో అన్నిటికీ దూరంగా..

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. మూడు జాతీయ అవార్డులు.. ఇప్పుడేమో చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్.. ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 12, 2026 | 3:07 PM

Share

ఏపీలోని గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన ఈ నటి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా కెరీర్ ప్రారంభించారు. చిన్నతనంలోనే ధైర్యంగా కెమెరాను ఫేస్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో వందల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. స్టారో హీరోలతో కలిసి సూపర్ హిట్స్ అందుకున్నారు. సాధారణంగా హీరోయిన్ గా అవకాశాల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతారు. కానీ ఈ అందాల తార మాత్రం అలా చేయలేదు. సహాయక నటిగానూ మెప్పించారు. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా నటించారు. ఈ నటికి సినిమా అంటే ఎంతిష్టమంటే.. తన జీవిత కాలంలో సుమారు 60 ఏళ్లు సినిమా ఇండస్ట్రీకే అంకితం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ నటి మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండు సార్లు ఫిలిం ఫేర్‌ అవార్డులు, ఎన్టీఆర్‌ జాతీయ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ 80 ఏళ్ల నటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈ దిగ్గజ నటి గురించి ఇటీవల ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ అందాల తార ఇప్పుడు ఓ చాక్లెట్ కంపెనీకి ఓనర్ గా వ్యవహరిస్తోందట.

ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? మన ఊర్వశి శారద. ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి ఇంట్లో ఆమె నివాసముంటున్నారు. అయితే శారద లోటస్ చాక్లెట్స్ పేరిట ఓ కంపెనీని రన్ చేస్తున్నారట. మహబూబ్‌నగర్‌ జిల్లా దౌలతాబాద్‌లో ఈ యూనిట్‌ ఉంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉత్పత్తి, మార్కెటింగ్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. చాకోలేట్స్‌తో పాటు, కొకోవా ప్రొడక్ట్స్‌, కొకోవా అనుబంధ ఉత్పత్తులను లోటస్‌ చాకోలేట్‌ కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం, సింగపూర్‌ కేంద్రంగా పని చేస్తున్న సన్‌షైన్‌ అలైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుబంధ సంస్థగా లోటస్‌ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా తెలుగులో బలిపీళం, శారద, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , ఊర్వశి, ఇంద్ర ధనుస్సు, ప్రతిధ్వని, జస్టిస్‌ చౌదరి, అత్తా కోడళ్లు, సర్దార్‌ పాపారాయుడు, అమ్మ రాజీనామా, ఏవండి ఆవిడ వచ్చింది, మేజర్ చంద్రకాంత్, అంతఃపురం, స్టాలిన్‌, యోగి, సుకుమారుడు వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు శారద. చివరిగా 2013లో సుకుమారుడు అనే సినిమాలో కనిపించారామె.

ఇవి కూడా చదవండి

ఇక శారద వ్యక్తిగత జీవితానికొస్తే నటుడు-నిర్మాత చలంని పెళ్లి చేసుకున్నారు కానీ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతం పెద్దగా బయట కనిపించని శారద ఇటీవలే ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు. శారదను చూసి ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరలయ్యింది.

పెళ్లి వేడుకలో శారద.. వీడియో ఇదిగో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us