పనసపండు తినేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే..
Krishna
12 may 2026
పండిన పనస పండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతాయి. దీనికి విరుద్ధంగా, పచ్చి పనసకాయలో చక్కెర తక్కువగా, పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.
పండు vs పచ్చి
పనస పండు మితమైన గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే ఇది అన్నం లేదా బ్రెడ్ కంటే మెరుగైనదే అయినప్పటికీ, మధుమేహం ఉన్నవారు దీనిని మితంగానే తీసుకోవాలి.
గ్లైసీమిక్ ఇండెక్స్
పనసలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది అన్నానికి బదులుగా పచ్చి పనస వంటకాలను ఎక్కువగా తింటారు.
పీచుపదార్థం
పచ్చి పనసలో కేలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయ ఆహారం. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, ఇతర ఆహారాలపై కోరికను తగ్గిస్తుంది.
బరువు నియంత్రణ
పనసలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి గుండె సమస్యలున్నావారు పనస తప్పక తినాలి.
గుండె ఆరోగ్యం
మీరు పనస పండు తినే రోజున, మీ భోజనంలో పిండిపదార్థాలు అధికంగా ఉండే అన్నం లేదా చపాతీలను తగ్గించుకోవాలి. దీనివల్ల శరీరంలో కేలరీల సమతుల్యత దెబ్బతినదు.
పిండిపదార్థాల సమతుల్యత
పనసలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
చర్మ సౌందర్యం
గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో పనస పండును అతిగా తినకూడదు. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్న వారు డైట్‌లో మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.