Nani: మరోసారి అయ్యప్ప మాలలో నాని.. దుబాయ్ ‘సైమా’లో స్పెషల్ అట్రాక్షన్‌గా న్యాచురల్ స్టార్

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి రామ్ చరణ్, నితిన్, నాని లాంటి యువ హీరోల వరకు కుదిరిన ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. నిష్టగా ఉంటూ అయ్యప్ప ను స్మరించుకుంటుంటారు. ఇప్పుడు మళ్లీ అయ్యప్ప మాలలు వేసుకునే సమయం వచ్చింది. ఇటీవలే బాలకృష్ణ 50 వసంతాల వేడుక లో మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప మాలతో దర్శనమిచ్చారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని మరోసారి అయ్యప్ప మాలలో కనిపించారు.

Nani: మరోసారి అయ్యప్ప మాలలో నాని.. దుబాయ్ 'సైమా'లో స్పెషల్ అట్రాక్షన్‌గా న్యాచురల్ స్టార్
Nani
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2024 | 8:03 AM

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా రెగ్యులర్ గా అయ్యప్ప మాలలు ధరిస్తుంటారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి రామ్ చరణ్, నితిన్, నాని లాంటి యువ హీరోల వరకు కుదిరిన ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. నిష్టగా ఉంటూ అయ్యప్ప ను స్మరించుకుంటుంటారు. ఇప్పుడు మళ్లీ అయ్యప్ప మాలలు వేసుకునే సమయం వచ్చింది. ఇటీవలే బాలకృష్ణ 50 వసంతాల వేడుక లో మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప మాలతో దర్శనమిచ్చారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని మరోసారి అయ్యప్ప మాలలో కనిపించారు. శనివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా సైమా-2024 అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు నాని అయ్యప్ప మాలలోనే హాజరయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు నానిని అభినందిస్తున్నారు. కాగా గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాలలోనే అమెరికాలో పర్యటించాడు.

న్యాచురల్ స్టార్ నాని గతంలో కూడా పలు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. గత సంవత్సరం మాల వేసుకొని పూజలు చేసి, శబరిమల వెళ్లి వచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడీ హీరో. ఇక సైమా- 2024 అవార్డుల్లో నాని హవా నడిచింది. 2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకున్నాడు. అంతేకాదు అతను నటించిన హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు, దసరా సినిమా 4 అవార్డులు సాధించడం విశేషం.

ఇవి కూడా చదవండి

సైమా పురస్కారాల్లో నాని..

ఇక న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఆగస్టు 29న రిలీజైన ఈ సినిమా వంద కోట్లకు చేరువలో ఉంది.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ అభినయం అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.