AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నాని.. మృణాల్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడంటే..

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 గా రూపొందనుందని న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Nani: నాని.. మృణాల్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడంటే..
Nani 30
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2023 | 6:58 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగరేణి నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా పనిచేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా కాకుండా.. ఇటీవలే ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 గా రూపొందనుందని న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గాభాను ధీరజ్ రాయుడు పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us