Karrthik Rathnam: త్వరలోనే పెళ్లిపీటలెక్కునున్న నారప్ప ఫేం కార్తీక్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు..

| Edited By: Phani CH

Mar 06, 2022 | 7:51 AM

'నారప్ప' ఫేం కార్తీక్‌ రత్నం (Karrthik Rathnam) త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. శనివారం అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

Karrthik Rathnam: త్వరలోనే పెళ్లిపీటలెక్కునున్న నారప్ప ఫేం కార్తీక్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు..
Karrthik Rathnam
Follow us on

‘నారప్ప’ ఫేం కార్తీక్‌ రత్నం (Karrthik Rathnam) త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. శనివారం అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం కార్తీక్‌ రత్నం ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అతనికి కాబోయే భార్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కార్తీక్‌ సీఏ కోర్సును మధ్యలోనే ఆపేసి మరీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రానా దగ్గుబాటి నిర్మించిన కేరాఫ్‌ కంచరపాలెంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో అతను పోషించిన జోసెఫ్‌ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇదే సినిమాను కేరాఫ్‌ కాదల్‌ పేరుతో తమిళ్‌ లో రీమేక్‌ చేయగా అక్కడ కూడా కార్తీ్‌కే నటించాడు. ఇక వెంకటేశ్‌ హీరోగా నటించిన నారప్ప సినిమాతో మనింత పాపులర్‌ అయ్యాడు కార్తీక్‌. ఇందులో వెంకీ కుమారుడు మునికన్నగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. సినిమాలో కనిపించేది కాసేపే అయినా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా అర్ధశతాబ్ధం సినిమాలోనూ హీరోగా నటించాడు. ఇక నితిన్‌ నటించిన చెక్‌, సంక్రాంతికి విడుదలైన రౌడీ బాయ్స్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు.

Also Read:అంగరంగ వైభవంగా.. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా గరుడ వాహన సేవ.

Viral Video: ఆపండ్రోయ్.. జాయింట్‌ వీల్‌లో బుడ్డోడి అరుపులు, కేకలు.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

Ravindra Jadeja: మెరుపు వీరుడు జడేజా డబుల్‌ సెంచరీ మిస్‌.. ద్రవిడ్‌, రోహిత్‌లను ఏకిపారేస్తున్న నెటిజన్స్