
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలై 7 రోజులు అయ్యింది. వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000కోట్లు వసూల్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ‘పుష్ప 2’ ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1032 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యిందని అని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నా రోహిత్. నారా రోహిత్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందని తెలిపాడు.
పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు రోహిత్. కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఫోటోను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు నాకు కూడా బాగా నచ్చింది. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని చూస్తున్నారని అందుకోసం అన్ని బాషల నుంచి నటులను తీసుకుంటున్నారని.. అలాగే షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేశారని నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.