Dasara: నాని మాస్ మసాలా మూవీకి భారీ డిమాండ్.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే అవాక్ అవవల్సిందే

|

Oct 07, 2022 | 5:56 PM

శ్యామ్ సింగరాయ్ సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్న నాని ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు.

Dasara: నాని మాస్ మసాలా మూవీకి భారీ డిమాండ్.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే అవాక్ అవవల్సిందే
Nani
Follow us on

నేచురల్ స్టార్ నాని మొన్నామధ్య అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. శ్యామ్ సింగరాయ్ సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్న నాని ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో నాని కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్  జరుగుతోంది. ఈ సినిమాకు డిజిటల్ హిందీ శాటిలైట్ ఆడియో రైట్స్ అన్నీ కలిపి 47 కోట్ల మేరకు రికార్డు స్తాయి మొత్తంలో ఆఫర్లు దక్కినట్టుగా తెలుస్తోంది.అంతే కాదు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి రూ.30 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఇతర భాషలకు చెందిన రైట్స్ రూ.10 కోట్లు పలికాయి. శాటిలైట్ రైట్స్ రూ.20 కోట్లు రాబట్టాయి. ఇలా ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల బిజినెస్ చేసిందానిన్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నాని కెరీర్ లో ఇంత భారీ బిజినెస్ జరిగిన సినిమా ఇదే..

ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని టాక్. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి