Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత

ప్రాణవాయువునిచ్చే మొక్కలను నాటాలని ఇప్పటికే చాలా మంది సినిమా తారలు, ప్రముఖులు చెప్తూ వస్తున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ అంటూ ప్రముఖులంతా మొక్కలు నాటి..

Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత
Nandita Swetha

Updated on: Apr 30, 2022 | 12:07 PM

ప్రాణవాయువునిచ్చే మొక్కలను నాటాలని ఇప్పటికే చాలా మంది సినిమా తారలు, ప్రముఖులు చెప్తూ వస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) అంటూ ప్రముఖులంతా మొక్కలు నాటి.. మరో ముగ్గురు నాటాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులంతా మొక్కలు నాటుతూ.. తమ అభిమానులను కూడా మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటి నందిత శ్వేత(Nandita Swetha) కూడా మొక్కలు నాటారు.

తన పుట్టినరోజు పురస్కరించుకుని జూబ్లీహిల్స్ జీ.హెచ్.ఎంసీ  పార్క్ లో మొక్కలు నాటారు నందిత శ్వేత..ఈ సందర్భంగా నందిత శ్వేత మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. నందిత శ్వేత ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతంలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే మరో వైపు టీవీ షోలకు జెడ్జ్ గా వ్యవహరిస్తోన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన నందిత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..