AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Kalyan Ram: స్టైలిష్ లుక్‌లో నందమూరి హీరో.. అమిగోస్ మూవీ నుంచి నయా పోస్టర్

ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు.

Nandamuri Kalyan Ram: స్టైలిష్ లుక్‌లో నందమూరి హీరో.. అమిగోస్ మూవీ నుంచి నయా పోస్టర్
Kalyan Ram
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2023 | 8:30 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార‌ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించడంతో నందమూరి అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమిగోస్ మూవీ నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ మ‌రో పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న మీసాలు తిప్పుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. త‌న పాత్ర పేరు సిద్ధార్థ్ అని పోస్ట‌ర్‌లో తెలుస్తుంది. దానిపై మ‌నిషిని పోలిన మ‌నిషి అని అర్థం వ‌చ్చేలా డోప‌ల్ గ్యాంగ‌ర్ అని రాశారు. దానికి వెనుక అస‌లు విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.

Amigos

Amigos

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్